టిడీపీ త‌ర‌ఫున ట్రాన్స్ జండ‌ర్స్ ప్ర‌చారం

0
153
views

ప్రొద్దుటూరు (కడ‌ప జిల్లా)ః తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు థార్డ్ జండ‌ర్స్‌. త‌మ‌కు స‌మాజంలో ఒక గుర్తింపు ఇచ్చి, అన్నివిష‌యాల్లో ప్ర‌త్యేక ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబు మ‌రో సారి ముఖ్య‌మంత్రి కావాల‌ని వారు అకాంక్షిస్తున్నారు. క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులోని 18 వార్డులో తెలుగుదేశం నేత‌ల‌తో క‌లిసి థార్డ్ జండ‌ర్స్ చేస్తున్న ఎన్నిక‌ల ప్ర‌చారం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది. కొంత కాలం క్రింద‌టి వ‌ర‌కు థార్డ్ జండ‌ర్స్‌కు స‌మాజంలో అధికారిక గుర్తింపు లేదు. వారి జండ‌ర్ ను నిర్ధారిస్తూ ఎలాంటి అధికార పత్రాలు కానీ, వారి కోసం ప్రత్యేక సంక్షేమ ప‌థ‌కాలు కానీ లేవు. టిడిపి ప్ర‌భుత్వంలో థార్డ్ జండ‌ర్స్‌ను గుర్తిస్తూ వారికి ప్ర‌త్యేకంగా ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు, ఫించ‌న్లు అంద‌జేయ‌డంతో వీరు చంద్రబాబు త‌ర‌ఫున ప్ర‌చారం చేప‌డుతున్నారు. బాబు మ‌ళ్ళీ ముఖ్య‌మంత్రి కావాలంటూ వారు దేశం పార్టీ నేత‌ల‌తో క‌లిపి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ప్రొద్దుటూరు మున్సిపాల్టీ ప‌రిధిలోని 18 వ వార్డులో మాజీ కౌన్సిల‌ర్ జిలానీ బాష ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ప్ర‌చార కార్య‌క్ర‌మంలో మాజీ మున్సిప‌ల్ చైర్మ‌న్ విఎస్ ముక్తియార్, మాజీ కౌన్సిల‌ర్ నూరీ, ఫ‌రీద్‌కో-ఆప్ష‌న్ స‌భ్యులు అబ్దుల్ హ‌మీద్‌, బాతుబోయిన సుబ్బారావు, మున్నా, త‌దిత‌రులలు పాల్గొన్నారు. థార్డ్ జండ‌ర్లు ఇంటింటికీ వెళ్లి టీడీపీకి ఓటు వెయ్యాల‌ని వారు అభ్య‌ర్ధిస్తున్నారు.