క‌డ‌ప జిల్లా క‌మ‌లాపురం మాజీ ఎమ్మెల్యే గండ్లూరు వీర‌శివారెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి వైసిపీలో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈమేర‌కు ప్రొద్దుటూరులోని త‌న నివాసంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. త‌న రాజీనామా లేఖ‌ను పార్టీ అధిష్టానానికి పంపిన‌ట్లు వెల్ల‌డించారు. గ‌త ఎన్నిక‌ల్లో క‌మ‌లాపురం టికెట్‌ను త‌న‌కు ఇస్తాన‌ని చెప్పి, చివ‌రి నిముషంలో చంద్ర‌బాబు మాట మార్చ‌డంతో తాను, త‌న క్యాడ‌ర్ మొన్నటి ఎన్నిక‌ల్లో తెలుగుదేశానికి వ్య‌తిరేకంగా వైసిపి అభ్య‌ర్ధి గెలుపు కోసం కృషి చేశాన‌న‌ని వీర‌శివారెడ్డి స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే క‌మ‌లాపురం ఎమ్మెల్యే పి.ర‌వీంద్రనాధ‌రెడ్డితో పాటు, వైసిపి నాయ‌కుల‌తో ట‌చ్‌లో ఉన్న‌ట్లు చెప్పారు. ముఖ్య‌మంత్రి సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి విదేశీ ప‌ర్య‌ట‌న అనంత‌రం తాను వైసీపీలో అధికారికంగా చేరుతున్న‌ట్లు వీరశివా చెప్పారు. జిల్లా అభివృద్ధి కోసం, ప‌రిశ్ర‌ములు, నీటి ప్రాజెక్టుల కోసంమే ఎలాంటి ష‌ర‌తులు లేకుండా వైసీపీలో చేరుతున్న‌ట్లు చెప్పారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి రాష్ట్రాభివృద్ధి కోసం ఎంత‌గానో కృషి చేస్తున్నారని, ఇంకా ఎంతో చేయాల్సి ఉంద‌ని ఆయ‌న చెప్పారు.