ట్రిబ్యున‌లో రాయ‌ల‌సీమ‌కు అన్యాయం- బొజ్జాద‌శ‌ర‌థ‌రామిరెడ్డి

0
221
views
dashart
* బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్(కృష్ణా జలాల పంపిణి ట్రిబ్యునల్) వాదనలో రాయలసీమకు అన్యాయం
* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి విశ్వేశ్వర ర రావు ను రీకాల్ చెయ్యాలి
* రాయలసీమ వాస్తవ నీటి వినియోగం ట్రిబ్యునల్ ముందు వినిపించడంలో రాష్ట్ర ప్రబుత్వం విపులం

 

నంద్యాల మాజీ పార్లమెంటు సభ్యులు బొజ్జా వెంకట రెడ్డి గారి స్వగృహంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమవేశంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొజ్జా దశరథ రామి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం కృష్ణా తుంగభద్ర నీటి వాటాలపై కొనసాగుతున్న జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో వాదనలు ఈ నెల నాలుగవ తేదిన డిల్లీలో జరిగాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రాయలసీమకు సాగునీటిలో తీరని అన్యాయం చేసే విధంగా తెలంగాణకు మేలు జరిగేలా వాదనలు ట్రిబ్యునల్ ముందు వినిపించడం భాధాకరం. తుంగభద్ర ఎగువ, తుంగభద్ర దిగువ మరియు కె సి కాలువలకు చట్టబద్ధ హక్కున్న నీటిలో నలబై శాతం నీరుకూడా అందడం లేదు. తుంగభద్ర ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాలకు సుంకేశుల ద్వారా వెళ్ళే వరద నీటిని కూడా రాయలసీమ వినియోగించినట్లుగా తెలంగాణా చేస్తున్న వాదనలను ఆంధ్ర ప్రదేశ్ అధికార ప్రతినిధి ఒప్పుకోవడం రాయలసీమకు తీరని అన్యాయం చెయ్యడమే. కె సి కెనాల్ కు అవసరము లేని సమయంలొ సుంకేసుల ద్వారా విదుదల చేస్తున్న వరద నీరు సోమశిలకు చేరుతున్నదే గాని వాస్తవానికి కె సి కెనాల్ అవసరాలు తీర్చడం లేదు. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా, గుంటూరు జిల్లాలు ఎక్కువ నీరు వాడుకుంటూ వాస్తవాలు పక్కన పెట్టి రాయలసీమ ఎక్కువ నీరు వాడుకుంటుందని ట్రిబ్యునల్ ముందు ప్రభుత్వ వాదనగా విశ్వేశ్వర రావు వినిపించడం రాయలసీమకు ద్రోహం చెయ్యడమే. కె సి ఎగువ ప్రాంతములో రిజర్వాయర్ లేకపోవడం వలన కె సి కెనాల్ అవసరాలకు నీటిని వినియోగించాలేకపోతున్న విషయాన్ని బ్రిజేష్ కుమార్ త్రిభ్యునల్ ముందు ఉంచడంలో రాష్ట్ర ప్రభుత్వం విపులమయ్యింది.
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పేలవమైన వాదనల పట్ల ప్రతిపక్షం , ఇతర రాజకీయ పార్టీలు నిలదీయాలి. రాయలసీమ బతుకు తెరువు సమస్యకు సంభందించిన ఈ విషయాలపై అఖిల పక్ష సమావేశం ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి రాజకీయ పార్టీలు వత్తిడిపెంచాలని కోరారు.
రాయలసీమకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వ వాదనలకు సంభంధించిన వార్తలు, రాయలసీమ ప్రజల కంటపడకుండా ఆ వార్తలను ప్రచరణ చెయ్యకుండా పత్రికలపై ఒత్తడి తెస్తున్న ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

రాయలసీమ సాగునీటి అంశాలపట్ల అవగాహన లేని ప్రభుత్వ ప్రతినిధిని వెంటనే రికాల్ చేసి, రాయలసీమ వాస్తవ పరిస్థితులను త్రిభ్యునల్ ముందు వివరించగలిగిన సాగునీటి నిపుణులను నియమించాలని డిమాండ్ చేసారు. ఈ విషయాలపై ముఖ్యమంత్రి , సాగునీటి ముఖ్య అధికారికి (ENC) వినతి పత్రాన్ని పంపుతున్నామని వివరించారు.
ఈ సమవేశంలో ఎర్వ రామచంద్రా రెడ్డి, చెరుకూరి వెంకటేశ్వర నాయుడు, ఎం వి రమణ రెడ్డి, పెసల శ్రీకాంత్. మహేశ్వర రెడ్డి, పట్నం రాముడు, సుధాకర రావు, బాస్కర రెడ్డి, కృష్ణా తదితరులు పాల్గొన్నారు