ఉగ్ర‌వాదుల‌ను ఉరితీయాలి- అంజుమ‌న్ ఆధ్వ‌ర్యంలో మైనార్టీల ర్యాలీ

0
142
views
minority rally

ప్రొద్దుటూరు పెన్నేరు న్యూస్ః 

 

పుల్వామా ఉగ్ర‌వాదుల దాడిలో మృతి చెందిన జ‌వాన్ల‌కు నివాళుల‌ర్పింది ప్రొద్దుటూరు అంజుమ‌న్ అహ‌లే ఇస్లాం క‌మిటీ. క‌మిటీ ఆధ్వ‌ర్యంలో ప్రొద్దుటూర‌లోని ముస్లిం మైనార్టీలు స్థానిక షా హుస్సేన్ వ‌లి ద‌ర్గా నుంచి ఉగ్ర‌వాదాన్ని అణ‌చి వేయాలంటూ ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. ద‌ర్గా నుంచి మొద‌లైన ర్యాలీ గంగ‌మ్మ దేవాల‌య‌లం మీదుగా పుట్ట‌ప‌ర్తి స‌ర్కిల్ వ‌ర‌కు సాగింది. మాజీ మున్సిప‌ల్ చైర్మ‌న్ విఎస్ ముక్తియ‌ర్‌, మైనార్టీ నాయ‌కులు భార‌త్ బ‌షీర్‌, వ‌క్ప్ బోర్డు జిల్లా అధ్యక్షుడు జాకీర్‌, మున్నా, కౌన్సిల‌ర్లు ర‌ఫి, బాబ‌య్య‌, లాయ‌ర్ లాలూ సాహెబ్‌, మాజీ కౌన్సిల‌ర్ అమీర్‌బాష‌, నూరీ, ఖ‌లీల్‌, ఇత‌ర మైనార్టీ నాయ‌కుల పెద్ద ఎత్తు పాల్గొన్నారు. జైవాన్ల‌ను బ‌లితీసుక‌న్న ఉగ్ర‌వాదుల‌ను ఉరితీయాల‌ని డిమాండ్ చేశారు. ఇస్లాం ఉగ్ర‌వాదాన్ని ప్రొత్స‌హించ‌ద‌ని, కొంద‌రు ఉగ్ర‌వాదులు ఇస్లాంను అడ్డంపెట్టుకుని హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని, దీన్ని దేశంలోని ప్ర‌తి ముస్లిం ఖండిస్తున్నాడ‌న్నారు. భార‌త జ‌వాన్ల‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌తి ఒక్క‌రూ మ‌ద్దుతుగా నిలిచారన్నారు. కేంద్రం త‌క్షం ఉగ్ర‌వాదాన్ని అణ‌చివేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని మైనార్టీ నేత‌లు డిమాండ్ చేశారు.