ప్రొద్దుటూరు టిడిపి టికెట్ బీసీల‌కే ఇవ్వాలంటూ సోమ‌వారం ర్యాలీ

0
328
views
chenna

ప్రొద్దుటూరు టిడిపి అసెంబ్లీ టికెట్ బీసీల‌కే ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్ర‌భుత్వ న్యాయ‌వాది, ప్రొద్దుటూరు బిసి మ‌హిళా నేత చెన్నా స‌ర‌ళాదేవి. ఇదే డిమాండ్‌పై సోమ‌వారం ప్రొద్దుటూరులో బిసీల‌కు టికెట్ ఇవ్వాలంటూ శాంతియుత ర్యాలీని మైదుకూరురోడ్డులోని అంబేద్క‌ర్ విగ్ర‌హం నుంచి గాందీరోడ్డులోని గాంధీ విగ్ర‌హం వ‌ర‌కు నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. ఈ మేర‌కు ఆమె మాజీ మున్సిప‌ల్ చైర్మ‌న్ చెన్నా వెంక‌ట‌సుబ్బ‌న్న‌తో క‌లిసి ప్రొద్దుటూరు ప్రెస్ క్ల‌బ్‌లో విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ప్రొద్దుటూరులోని బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, ఇత‌ర వ‌ర్గాల వారు బీసీల‌కు మ‌ద్ద‌తుగా నిలిచాల‌ర‌ని అంద‌రూ ఒకే తాటిపైకి వ‌చ్చార‌న్నారు. బిసీల ఐక్య‌త‌ను చాటున్న నేప‌థ్యంలో తెలుగుదేశం పార్టీ టికెట్ బీసీల‌కు కేటాయించాల‌ని ఆమె విజ్ఞ‌ప్తి చేశారు. సోమ‌వారం త‌ల‌పెట్టిన ప్ర‌ద‌ర్శ‌న‌లో బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వ‌ర్గాల‌క చెందిన వారు పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు.