Home News ఉల్లి రైతును ఆదుకోక‌పోతే భారీ ప్ర‌తిఘ‌ట‌న త‌ప్ప‌దు- వైసిపి

ఉల్లి రైతును ఆదుకోక‌పోతే భారీ ప్ర‌తిఘ‌ట‌న త‌ప్ప‌దు- వైసిపి

కెపి ఉల్లిరైతును ఆదుకోక‌పోతే వారి నుంచి గ‌ట్టి ప్ర‌తిఘ‌ట‌న ఎదుర్కోక త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు వైసిపి నాయ‌కులు. క‌డ‌ప వైసిపి కార్యాయ‌లంలో జిల్లా అధ్య‌క్ష‌డు కె.సురేష్‌బాబు, మైదుకూరు ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి, రైతు నాయ‌కులు సంబటూరు వీరారెడ్డి, ఇత‌ర నాయ‌కులు విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌భుత్వం ఉల్లి కొనుగోలుకు సంబంధించి జారీ చేసిన జీవో 69 విరుద్దంగా కొనుగోళ్లు ఆపివేయడంతో రైతులు ఆందోళ చెందుతున్నార‌ని వారు చెప్పారు. 24 వేల ట‌న్నుల కెపి ఉల్లిని కొనుగోలు చేస్తామ‌ని చెప్పి, జీవో జారీ చేసిన ప్ర‌భుత్వం కేవలం 1300 ట‌న్నుల మాత్ర‌మే కొనుగోలు చేసి ఆపై మైదుకూరులోని మ‌ర్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని మూసివేయ‌డం రైతుల‌కు ఆగ్ర‌హాన్ని తెప్పిస్తోంద‌ని మైదుకూరు ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి చెప్పారు. కెసి ఉల్లి పండించిన రైతుల వ‌ద్ద ఉన్న మొత్తం ఉల్లిని గ్రేడింగ్‌ల ప్ర‌కారం కొనుగోలు చేసి, ప‌దిరోజుల్లో డ‌బ్బును కూడా ఆన్ లైన్‌లో రైతుల ఖాతాకు జ‌మ‌చేయాల‌ని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో మైద‌కూరులోకెపి ఉల్లి రైతుల‌తో భారీ ఆందోళ‌న చేప‌డ‌తామ‌ని వారు హెచ్చరించారు.

Vanam Sarama
News As It is

Must Read

టిడీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే వీర‌శివ‌

క‌డ‌ప జిల్లా క‌మ‌లాపురం మాజీ ఎమ్మెల్యే గండ్లూరు వీర‌శివారెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి వైసిపీలో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈమేర‌కు ప్రొద్దుటూరులోని త‌న నివాసంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. త‌న రాజీనామా లేఖ‌ను పార్టీ...

నేటి సాయంత్రం 6 గంట‌ల‌కు ప్ర‌చారం స‌మాప్తి

అమరావతి: ఎన్నికల నియమావళి ప్రకారం మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి మీడియాలో ఎలాంటి ప్రకటనలు జారీ చేయకూడదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జీకే ద్వివేది స్పష్టం చేశారు. 10, 11 తేదీల్లో ప్రకటనలు...

టిడీపీ త‌ర‌ఫున ట్రాన్స్ జండ‌ర్స్ ప్ర‌చారం

ప్రొద్దుటూరు (కడ‌ప జిల్లా)ః తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు థార్డ్ జండ‌ర్స్‌. త‌మ‌కు స‌మాజంలో ఒక గుర్తింపు ఇచ్చి, అన్నివిష‌యాల్లో ప్ర‌త్యేక ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబు మ‌రో సారి ముఖ్య‌మంత్రి...

ప్రొద్దుటూరు టిడిపి టికెట్ బీసీల‌కే ఇవ్వాలంటూ సోమ‌వారం ర్యాలీ

ప్రొద్దుటూరు టిడిపి అసెంబ్లీ టికెట్ బీసీల‌కే ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్ర‌భుత్వ న్యాయ‌వాది, ప్రొద్దుటూరు బిసి మ‌హిళా నేత చెన్నా స‌ర‌ళాదేవి. ఇదే డిమాండ్‌పై సోమ‌వారం ప్రొద్దుటూరులో బిసీల‌కు టికెట్ ఇవ్వాలంటూ శాంతియుత...