Home Blog

టిడీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే వీర‌శివ‌

0

క‌డ‌ప జిల్లా క‌మ‌లాపురం మాజీ ఎమ్మెల్యే గండ్లూరు వీర‌శివారెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి వైసిపీలో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈమేర‌కు ప్రొద్దుటూరులోని త‌న నివాసంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. త‌న రాజీనామా లేఖ‌ను పార్టీ అధిష్టానానికి పంపిన‌ట్లు వెల్ల‌డించారు. గ‌త ఎన్నిక‌ల్లో క‌మ‌లాపురం టికెట్‌ను త‌న‌కు ఇస్తాన‌ని చెప్పి, చివ‌రి నిముషంలో చంద్ర‌బాబు మాట మార్చ‌డంతో తాను, త‌న క్యాడ‌ర్ మొన్నటి ఎన్నిక‌ల్లో తెలుగుదేశానికి వ్య‌తిరేకంగా వైసిపి అభ్య‌ర్ధి గెలుపు కోసం కృషి చేశాన‌న‌ని వీర‌శివారెడ్డి స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే క‌మ‌లాపురం ఎమ్మెల్యే పి.ర‌వీంద్రనాధ‌రెడ్డితో పాటు, వైసిపి నాయ‌కుల‌తో ట‌చ్‌లో ఉన్న‌ట్లు చెప్పారు. ముఖ్య‌మంత్రి సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి విదేశీ ప‌ర్య‌ట‌న అనంత‌రం తాను వైసీపీలో అధికారికంగా చేరుతున్న‌ట్లు వీరశివా చెప్పారు. జిల్లా అభివృద్ధి కోసం, ప‌రిశ్ర‌ములు, నీటి ప్రాజెక్టుల కోసంమే ఎలాంటి ష‌ర‌తులు లేకుండా వైసీపీలో చేరుతున్న‌ట్లు చెప్పారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి రాష్ట్రాభివృద్ధి కోసం ఎంత‌గానో కృషి చేస్తున్నారని, ఇంకా ఎంతో చేయాల్సి ఉంద‌ని ఆయ‌న చెప్పారు.

నేటి సాయంత్రం 6 గంట‌ల‌కు ప్ర‌చారం స‌మాప్తి

0

అమరావతి: ఎన్నికల నియమావళి ప్రకారం మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి మీడియాలో ఎలాంటి ప్రకటనలు జారీ చేయకూడదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జీకే ద్వివేది స్పష్టం చేశారు. 10, 11 తేదీల్లో ప్రకటనలు జారీ చేయాలనుకునే పార్టీలు, అభ్యర్థులు తాజాగా ఎంసీఎంసీ కమిటీకి దరఖాస్తు చేసుకోవాలన్నారు. గతంలో ఎంసీఎంసీ కమిటీ ఇచ్చిన అనుమతి మంగళవారం సాయంత్రం 6 గంటలతోనే ముగిసిపోతుందన్నారు. ఆయా పార్టీల అభ్యర్థులు తమ పేరు, పార్టీ గుర్తు, ఈవీఎంలో పేరు, పార్టీ గుర్తు, స్వతంత్రులు, గుర్తింపు పొందని రాజకీయ పార్టీల అభ్యర్థులైతే ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తు, ఈవీఎంలో క్రమ సంఖ్య ఉండే వివరాలతో మాత్రమే ప్రకటనలు జారీ చేయాలన్నారు.
వీటికి కూడా ఎంసీఎంసీ కమిటీ అనుమతులు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు పార్టీలు మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో ఇస్తున్న ప్రకటనలు, డిజిటల్‌ రూపంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్‌ మంగళవారం సాయంత్రం 6 గంటల తర్వాత తొలగించాలన్నారు. మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో పార్టీలు, అభ్యర్థులు ఎటువంటి ప్రకటనలు చేయకూడదన్నారు. అలా చేస్తే కోడ్‌ ఉల్లంఘన కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

టిడీపీ త‌ర‌ఫున ట్రాన్స్ జండ‌ర్స్ ప్ర‌చారం

0

ప్రొద్దుటూరు (కడ‌ప జిల్లా)ః తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు థార్డ్ జండ‌ర్స్‌. త‌మ‌కు స‌మాజంలో ఒక గుర్తింపు ఇచ్చి, అన్నివిష‌యాల్లో ప్ర‌త్యేక ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబు మ‌రో సారి ముఖ్య‌మంత్రి కావాల‌ని వారు అకాంక్షిస్తున్నారు. క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులోని 18 వార్డులో తెలుగుదేశం నేత‌ల‌తో క‌లిసి థార్డ్ జండ‌ర్స్ చేస్తున్న ఎన్నిక‌ల ప్ర‌చారం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది. కొంత కాలం క్రింద‌టి వ‌ర‌కు థార్డ్ జండ‌ర్స్‌కు స‌మాజంలో అధికారిక గుర్తింపు లేదు. వారి జండ‌ర్ ను నిర్ధారిస్తూ ఎలాంటి అధికార పత్రాలు కానీ, వారి కోసం ప్రత్యేక సంక్షేమ ప‌థ‌కాలు కానీ లేవు. టిడిపి ప్ర‌భుత్వంలో థార్డ్ జండ‌ర్స్‌ను గుర్తిస్తూ వారికి ప్ర‌త్యేకంగా ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు, ఫించ‌న్లు అంద‌జేయ‌డంతో వీరు చంద్రబాబు త‌ర‌ఫున ప్ర‌చారం చేప‌డుతున్నారు. బాబు మ‌ళ్ళీ ముఖ్య‌మంత్రి కావాలంటూ వారు దేశం పార్టీ నేత‌ల‌తో క‌లిపి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ప్రొద్దుటూరు మున్సిపాల్టీ ప‌రిధిలోని 18 వ వార్డులో మాజీ కౌన్సిల‌ర్ జిలానీ బాష ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ప్ర‌చార కార్య‌క్ర‌మంలో మాజీ మున్సిప‌ల్ చైర్మ‌న్ విఎస్ ముక్తియార్, మాజీ కౌన్సిల‌ర్ నూరీ, ఫ‌రీద్‌కో-ఆప్ష‌న్ స‌భ్యులు అబ్దుల్ హ‌మీద్‌, బాతుబోయిన సుబ్బారావు, మున్నా, త‌దిత‌రులలు పాల్గొన్నారు. థార్డ్ జండ‌ర్లు ఇంటింటికీ వెళ్లి టీడీపీకి ఓటు వెయ్యాల‌ని వారు అభ్య‌ర్ధిస్తున్నారు.

ప్రొద్దుటూరు టిడిపి టికెట్ బీసీల‌కే ఇవ్వాలంటూ సోమ‌వారం ర్యాలీ

0
chenna

ప్రొద్దుటూరు టిడిపి అసెంబ్లీ టికెట్ బీసీల‌కే ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్ర‌భుత్వ న్యాయ‌వాది, ప్రొద్దుటూరు బిసి మ‌హిళా నేత చెన్నా స‌ర‌ళాదేవి. ఇదే డిమాండ్‌పై సోమ‌వారం ప్రొద్దుటూరులో బిసీల‌కు టికెట్ ఇవ్వాలంటూ శాంతియుత ర్యాలీని మైదుకూరురోడ్డులోని అంబేద్క‌ర్ విగ్ర‌హం నుంచి గాందీరోడ్డులోని గాంధీ విగ్ర‌హం వ‌ర‌కు నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. ఈ మేర‌కు ఆమె మాజీ మున్సిప‌ల్ చైర్మ‌న్ చెన్నా వెంక‌ట‌సుబ్బ‌న్న‌తో క‌లిసి ప్రొద్దుటూరు ప్రెస్ క్ల‌బ్‌లో విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ప్రొద్దుటూరులోని బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, ఇత‌ర వ‌ర్గాల వారు బీసీల‌కు మ‌ద్ద‌తుగా నిలిచాల‌ర‌ని అంద‌రూ ఒకే తాటిపైకి వ‌చ్చార‌న్నారు. బిసీల ఐక్య‌త‌ను చాటున్న నేప‌థ్యంలో తెలుగుదేశం పార్టీ టికెట్ బీసీల‌కు కేటాయించాల‌ని ఆమె విజ్ఞ‌ప్తి చేశారు. సోమ‌వారం త‌ల‌పెట్టిన ప్ర‌ద‌ర్శ‌న‌లో బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వ‌ర్గాల‌క చెందిన వారు పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు. 

 

బిసీల‌కు టికెట్ కోసం రేపు ప్రొద్దుటూరులో సామాజిక న్యాయ దీక్ష‌

0
bc meeting

బీసీలు సామాజికంగా ఎద‌గాలంటే రాజ‌కీయంగా అభివృద్ధి చెందాల‌న్న ఉద్దేశ్యంతో రాజ‌కీయ పార్టీలు బీసీల‌కు టికెట్ ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో సామాజిక న్యాయ దీక్ష కార్య‌క్రామాన్ని బుధ‌వారం ప‌ట్ట‌ణంలోని శివాయం స‌ర్కిల్‌లో భారీ ఎత్తున చేప‌డుతున్నారు. ఈ మేర‌కు ప్రొద్దుటూరులోని బీసీ ప్ర‌జా చైత‌న్య స‌మాఖ్య కార్యాల‌యంలో బిసీ నాయ‌కులు బొర్రా రామాంజ‌నేయు, తొగ‌ట‌వీర క్ష‌త్రిక సంఘం జిల్లా అధ్య‌క్షులు పాణ్యం సుబ్బ‌రాయుడులు సంయుక్తంగా విలేక‌రుల సమావేశం నిర్వ‌హించారు. బిసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వ‌ర్గాల‌తో సంయుక్తంగా సామాజిక న్యాయ దీక్ష పోరాటం చేస్తున్నామ‌ని, ప్ర‌తి ఒక్క‌రూ దీన్ని విజ‌య‌వంతం చేయాల‌ని వారు పిలుపు నిచ్చారు.

బాబూ బిసీల‌లో ఏ కులాన్ని అభివృద్ధి చేశారు- ఆ కులంలో చేరుతా

0
rachaallu

తెలుగుదేశం చెబుతున్న‌ట్లుగా బీసీలు వారి వెంట లేర‌ని వారి వెంటనే దేశం పార్టీ ఉంద‌ని ఆరోపించారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి. చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చాక బీసీ వ‌ర్గాల్లో ఏ వర్గానైనా బాగుచేశారా అని ప్ర‌శ్నించారు. ఏ ఒక్క కులం అభివృద్ధి ప‌రిచామ‌ని చూపిస్తే ఆ కులంలో తాను మారేందుకు సిద్ధ‌మ‌ని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బిసీల‌ను అన్ని విధాలుగా అభివృద్ధిచేసేందుకు ప్ర‌ణాళికా బ‌ద్దంగా ముందుకు వెళుతున్నార‌ని, ఆదిశ‌గానే ఏలూరు బిసీ గ‌ర్జ‌న‌లో ప్ర‌క‌ట‌న చేశార‌ని ఎమ్మెల్యే వివ‌రించారు.

ఉల్లి రైతును ఆదుకోక‌పోతే భారీ ప్ర‌తిఘ‌ట‌న త‌ప్ప‌దు- వైసిపి

0
ysrcp

కెపి ఉల్లిరైతును ఆదుకోక‌పోతే వారి నుంచి గ‌ట్టి ప్ర‌తిఘ‌ట‌న ఎదుర్కోక త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు వైసిపి నాయ‌కులు. క‌డ‌ప వైసిపి కార్యాయ‌లంలో జిల్లా అధ్య‌క్ష‌డు కె.సురేష్‌బాబు, మైదుకూరు ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి, రైతు నాయ‌కులు సంబటూరు వీరారెడ్డి, ఇత‌ర నాయ‌కులు విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌భుత్వం ఉల్లి కొనుగోలుకు సంబంధించి జారీ చేసిన జీవో 69 విరుద్దంగా కొనుగోళ్లు ఆపివేయడంతో రైతులు ఆందోళ చెందుతున్నార‌ని వారు చెప్పారు. 24 వేల ట‌న్నుల కెపి ఉల్లిని కొనుగోలు చేస్తామ‌ని చెప్పి, జీవో జారీ చేసిన ప్ర‌భుత్వం కేవలం 1300 ట‌న్నుల మాత్ర‌మే కొనుగోలు చేసి ఆపై మైదుకూరులోని మ‌ర్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని మూసివేయ‌డం రైతుల‌కు ఆగ్ర‌హాన్ని తెప్పిస్తోంద‌ని మైదుకూరు ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి చెప్పారు. కెసి ఉల్లి పండించిన రైతుల వ‌ద్ద ఉన్న మొత్తం ఉల్లిని గ్రేడింగ్‌ల ప్ర‌కారం కొనుగోలు చేసి, ప‌దిరోజుల్లో డ‌బ్బును కూడా ఆన్ లైన్‌లో రైతుల ఖాతాకు జ‌మ‌చేయాల‌ని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో మైద‌కూరులోకెపి ఉల్లి రైతుల‌తో భారీ ఆందోళ‌న చేప‌డ‌తామ‌ని వారు హెచ్చరించారు.

ట్రిబ్యున‌లో రాయ‌ల‌సీమ‌కు అన్యాయం- బొజ్జాద‌శ‌ర‌థ‌రామిరెడ్డి

0
dashart
* బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్(కృష్ణా జలాల పంపిణి ట్రిబ్యునల్) వాదనలో రాయలసీమకు అన్యాయం
* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి విశ్వేశ్వర ర రావు ను రీకాల్ చెయ్యాలి
* రాయలసీమ వాస్తవ నీటి వినియోగం ట్రిబ్యునల్ ముందు వినిపించడంలో రాష్ట్ర ప్రబుత్వం విపులం

 

నంద్యాల మాజీ పార్లమెంటు సభ్యులు బొజ్జా వెంకట రెడ్డి గారి స్వగృహంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమవేశంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొజ్జా దశరథ రామి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం కృష్ణా తుంగభద్ర నీటి వాటాలపై కొనసాగుతున్న జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో వాదనలు ఈ నెల నాలుగవ తేదిన డిల్లీలో జరిగాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రాయలసీమకు సాగునీటిలో తీరని అన్యాయం చేసే విధంగా తెలంగాణకు మేలు జరిగేలా వాదనలు ట్రిబ్యునల్ ముందు వినిపించడం భాధాకరం. తుంగభద్ర ఎగువ, తుంగభద్ర దిగువ మరియు కె సి కాలువలకు చట్టబద్ధ హక్కున్న నీటిలో నలబై శాతం నీరుకూడా అందడం లేదు. తుంగభద్ర ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాలకు సుంకేశుల ద్వారా వెళ్ళే వరద నీటిని కూడా రాయలసీమ వినియోగించినట్లుగా తెలంగాణా చేస్తున్న వాదనలను ఆంధ్ర ప్రదేశ్ అధికార ప్రతినిధి ఒప్పుకోవడం రాయలసీమకు తీరని అన్యాయం చెయ్యడమే. కె సి కెనాల్ కు అవసరము లేని సమయంలొ సుంకేసుల ద్వారా విదుదల చేస్తున్న వరద నీరు సోమశిలకు చేరుతున్నదే గాని వాస్తవానికి కె సి కెనాల్ అవసరాలు తీర్చడం లేదు. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా, గుంటూరు జిల్లాలు ఎక్కువ నీరు వాడుకుంటూ వాస్తవాలు పక్కన పెట్టి రాయలసీమ ఎక్కువ నీరు వాడుకుంటుందని ట్రిబ్యునల్ ముందు ప్రభుత్వ వాదనగా విశ్వేశ్వర రావు వినిపించడం రాయలసీమకు ద్రోహం చెయ్యడమే. కె సి ఎగువ ప్రాంతములో రిజర్వాయర్ లేకపోవడం వలన కె సి కెనాల్ అవసరాలకు నీటిని వినియోగించాలేకపోతున్న విషయాన్ని బ్రిజేష్ కుమార్ త్రిభ్యునల్ ముందు ఉంచడంలో రాష్ట్ర ప్రభుత్వం విపులమయ్యింది.
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పేలవమైన వాదనల పట్ల ప్రతిపక్షం , ఇతర రాజకీయ పార్టీలు నిలదీయాలి. రాయలసీమ బతుకు తెరువు సమస్యకు సంభందించిన ఈ విషయాలపై అఖిల పక్ష సమావేశం ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి రాజకీయ పార్టీలు వత్తిడిపెంచాలని కోరారు.
రాయలసీమకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వ వాదనలకు సంభంధించిన వార్తలు, రాయలసీమ ప్రజల కంటపడకుండా ఆ వార్తలను ప్రచరణ చెయ్యకుండా పత్రికలపై ఒత్తడి తెస్తున్న ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

రాయలసీమ సాగునీటి అంశాలపట్ల అవగాహన లేని ప్రభుత్వ ప్రతినిధిని వెంటనే రికాల్ చేసి, రాయలసీమ వాస్తవ పరిస్థితులను త్రిభ్యునల్ ముందు వివరించగలిగిన సాగునీటి నిపుణులను నియమించాలని డిమాండ్ చేసారు. ఈ విషయాలపై ముఖ్యమంత్రి , సాగునీటి ముఖ్య అధికారికి (ENC) వినతి పత్రాన్ని పంపుతున్నామని వివరించారు.
ఈ సమవేశంలో ఎర్వ రామచంద్రా రెడ్డి, చెరుకూరి వెంకటేశ్వర నాయుడు, ఎం వి రమణ రెడ్డి, పెసల శ్రీకాంత్. మహేశ్వర రెడ్డి, పట్నం రాముడు, సుధాకర రావు, బాస్కర రెడ్డి, కృష్ణా తదితరులు పాల్గొన్నారు